దర్శకుడు చెప్పాడని అలా చేశా.. కానీ.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..!

-

ఈ మధ్య కాలంలో సినిమాల్లో హాట్ డోస్ రోజురోజుకు ఎక్కువవుతోంది అనే విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కాస్త హాట్ డోస్ తగ్గినప్పటికీ… చిన్న సినిమాల్లో మాత్రం రోజు రోజుకిహాట్ డోస్ పెరిగిపోతూనే ఉంది అయితే ఇటీవలే సోషల్ మీడియా లో విడుదలైన చెక్ మేట్ అనే సినిమాకు సంబంధించిన ట్రైలర్ కాస్త సోషల్ మీడియా లో వైరల్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పోవే పోరా అని షో తో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ విష్ణు ప్రియ నటించింది. కాగా సినిమాలో హాట్ రొమాంటిక్ క్యారెక్టర్లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ… దర్శకుడు పాత్రకు బోల్డ్నెస్ ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడంతో తనని తాను మోటివేట్ చేసుకుని చేశానని కానీ అందరి ముందు అలా చేయడం ఎంతో ఇబ్బందిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది విష్ణుప్రియ

Read more RELATED
Recommended to you

Exit mobile version