ఇటీవలే ఏపీ మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం జరగడం ఆంధ్ర రాజకీయాలను ఊపేసింది అన్న విషయం తెలిసిందే. అయితే తనపై ఎందుకు హత్య యత్నం చేశారు అనేది మాత్రం తనకు తెలియదు అంటూ మంత్రి పేర్ని నాని తెలిపారు అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజల్లో సింపతి సాధించేందుకే ఒకప్పుడు జగన్ ఇక ఇప్పుడు పేర్ని నాని వారిపై వారే దాడి చేయించుకున్నారు అంటూ ప్రస్తుతం టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన మంత్రి కొడాలి నాని మీడియా సమావేశంలో టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు జగన్ ప్రస్తుతం పేర్నినాని కావాలని వారిపై వారే దాడి చేయించుకున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు అందరూ నీచంగా మాట్లాడుతున్నారు అంటూ చెప్పుకొచ్చిన ఏపీ మంత్రి కొడాలి నాని… ఇలా అయితే ఒకప్పుడు చంద్రబాబు పై అలిపిరిలో జరిగిన దాడి కూడా తనపై తానే దాడి చేయించుకున్నారా అంటూ ప్రశ్నించారు. టిడిపి కావాలని ప్రతి విషయం పై రాద్ధాంతం చేస్తుంది అంట విమర్శించారు.