చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే : సీఎం జగన్

-

టీడీపీ అధినేత చంద్రబాబు దారి అడ్డదారి అని.. పేదల భవిష్యత్ ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయని పేర్కొన్నారు సీఎం జగన్. ఇవాళ ప్రకాశం జిల్లా మేమంతా సిద్ధం సభలో చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. అవ్వాతాతలను చంపుతున్న హంతకుడు చంద్రబాబు అన్నారు. తన మనిషి నిమ్మగడ్డతో ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయించి పెన్షన్లు నిలిపివేయించాడు. మండే ఎండల్లో పేదలను రోడ్డుపై నిలబెట్టాడు. రాజకీయం కోసం పేదలను చంపే చంద్రబాబుది శాడిజం కాక మరేమిటి..? చంద్రబాబు రాజకీయం మొత్తం దగా, మోసం, వెన్నుపోటే అని మండిపడ్డారు.

చంద్రబాబుకు ఓటు వేస్తే.. జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే.. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయని ధ్వజమెత్తారు జగన్. 56 నెలలుగా అందుతున్న పెన్షన్లను అర్థాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారం అయినా, సెలవు రోజు అయినా పెన్షన్లను ఒకటో తేదీనే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు వాలంటీర్లు. ప్రస్తుతం మండే ఎండలో పేదలను నిలబెట్టాడు. అవ్వతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు అన్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version