తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రకాశం జిల్లా ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘అవ్వాతాతల్ని చంపుతున్న హంతకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. తన మనిషి నిమ్మగడ్డతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి పెన్షన్లను నిలిపివేయించాడు అని విమర్శించారు.
”56 నెలలుగా అందుకున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా, సెలవురోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారు అని అన్నారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర అని వైఎస్ జగన్ అన్నారు.మండే ఎండల్లో పేదల్ని రోడ్డుపై నిలబెట్టాడు. రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబుది శాడిజం కాక మరేమిటి? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయం మొత్తం దగా, మోసం, వెన్నుపోటే’ అని విరుచుకుపడ్డారు.