ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదు అయింది. ఇప్పటికే ఎవ్వరికీ వారు ధీమాగా ఉన్నారు. ఈ తరుణంలోనే ఏపీలో పలు చోట్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి బాపులపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురు నేతల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగడంతో పోలీసులు సరిచెప్పి అక్కడి నుంచి పంపించారు.