ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడుతారా.. అని, నిండు శాసనసభను తప్పుదోవ పట్టించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్
అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన వీడియోతో పాటు ఉత్తమ్ ఎథిక్స్ కమిటీకి రాసిన లేఖను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
దీనిపై ఆయన.. తాను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ గా ఉన్న సమయంలోనే మహువా
మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు ఎక్స్పెల్ జరిగిందని ఈరోజు సభలో చెప్పుకున్న ఉత్తం కుమార్ రెడ్డి, తాను ఆ రద్దును వ్యతిరేకిస్తూ అది అన్యాయమని, రాజ్యంగ విరుద్ధమని అసమ్మతి నోటు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారని అన్నారు. అలాగే తాను ఇచ్చిన అసమ్మతి నోట్ లో మహువా మెయిత్రాను వ్యక్తిగత ద్వేశం, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఎక్స్పెల్ చేసారని సైతం పేర్కొన్నాడని తెలిపారు.