ట్రిపుల్ ఎక్స్ సబ్బుల కంపెనీ అధినేత కన్నుమూత

-

ప్రముఖ వ్యాపారవేత్త, ‘XXX’ సబ్బుల కంపెనీ అధినేత మాణిక్కవేల్ అరుణాచలం మరణించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గుంటూరు అరండల్ పేటలోని స్వగృహంలో ఈ రోజు (గురువారం) మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మాణిక్కవేల్ అరుణాచలం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లో స్థిరపడ్డారు.

ఇక్కడి నుంచే సబ్బుల వ్యాపారం  మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. రేపు (శుక్రవారం) ఉదయం ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు సమాచారం. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో XXX సోప్, ఈ బ్రాండ్ ఇతర ఉత్పత్తుల ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version