స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై
సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై ఆ పార్టీ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్
కుమార్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయడం పిరికిపంద చర్య అని.. జగదీష్ రెడ్డి ఎక్కడా సభా గౌరవాన్ని కించపరచలేదు అన్నారు. రేవంత్ రెడ్డి లాగా బూతులు మాట్లాడి తగ్గించలేదు.. చట్టవిరుద్ధ చర్యలకు కూడా పాల్పడలేదు. కేవలం ఏకవచనంతో మాట్లాడారన్న అపవాదుతో సస్పెండ్ చేయడం వెనుక మీ భయం, ఆందోళన కనబడుతున్నది. ఆయన అలా మాట్లాడితే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడాల్సింది లేదా, క్షమాపణ కోరాల్సింది.. కానీ ఏకపక్షంగా సస్పెండ్ చేయడం మీ చేతగాని తనానికి నిదర్శనం అని విమర్శించారు.