సీఎం జగన్ కు నాకు పరిచయమే లేదు.. సోదరుడిపై షర్మిల సెన్షేషన్ కామెంట్స్

-

ఆంధ్రప్రదేశ్  సీఎం, సోదరుడు జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడని.. ఈ జగన్ మోహన్ రెడ్డికి నాకు పరిచయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. వైఎస్ఆర్ బిడ్డ నిలబడుతుందని తెలిపారు. ఈ నిర్ణయం నాకు సులువైంది కాదని.. ఈ నిర్ణయం నా కుటుంబాన్ని చీలుస్తుంది అని తెలుసు.. అయినా తప్పని సరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. జగన్ నా అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడు.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడని ఫైర్ అయ్యారు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు. ఇదే తట్టుకోలేక పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు, హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు అని అసహనం వ్యక్తం చేశారు.

మళ్ళీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేక పోయానన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని, వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్, వివేకా రామ లక్ష్మణుడిలా ఉండేవాళ్ళన్నారు. వివేకా ఆకరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని.. నన్ను ఎందుకు ఆయన ఎంపీగా ఉండమని అడిగారో ఇవ్వాళ అర్ధం అయ్యిందన్నారు. నేను హత్యా రాజకీయాలకు విరుద్ధమని, ఒక హంతకుడు పార్లమెంట్ మెట్టు ఎక్కకూడదని ఈ నిర్ణయం

Read more RELATED
Recommended to you

Exit mobile version