ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే.ఇక ఆయన స్థాపించిన పార్టీకి “తమిళ వెట్రి కజగం” అనే పేరు ఖరారు చేశారు హీరో విజయ్ .2026 అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని విజయ్ తెలిపారు.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో హీరో విజయ్ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.GOATలో ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, మిక్ మోహన్, జయరాం,యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే విజయ్ కి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) సినిమాయే ఆఖరిది అని వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తయ్యాక మరో సినిమా చేస్తున్నానని, అదే తనకు ఆఖరిదని విజయ్ ప్రకటించారు. పూర్తిగా రాజకీయ కోణంలో సాగే ఓ కథను హెచ్ వినోత్ ఆయనకు చెప్పినట్ల తెలుస్తోంది. పొలిటికల్ ఎంట్రీకి ఆ కథ కరెక్ట్ గా ఉంటుందని దళపతి భావించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.