సీఎం కూడా చీరలను గమనిస్తారంటే ఆశ్చర్యం వేస్తోంది : షర్మిల

-

ఏపీ సీఎం జగన్.. తన సోదరి పసుపు చీర కట్టుకొని ప్రచారం చేస్తున్నారని.. ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై తాజాగా షర్మిల స్పందించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా ఆడవాళ్లు ఏ చీర కట్టుకున్నారనేది గమనిస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. పసుపు రంగుతో ఆయనకు ఉన్న సమస్య ఏంటో అర్థం కావడం లేదు. పసుపు రంగ చంద్రబాబు సొంతం కాదు. ఆయన పేటెంట్ హక్కులు కొనుక్కోలేదని షర్మిల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ అన్న. దేవుడే గుణపాఠం చెప్తారట. నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం జగనన్నే. ఇవాళ వైఎస్సార్ కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్నే. దీనికి సాక్ష్యం దేవుడు.. దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం అన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version