పేదల భవిష్యత్ ను నిర్ణయించేది ఈ ఎన్నికలే అని సీఎం జగన్ తెలిపారు. ఇవాళ నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు సీఎం జగన్. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇంటింటికి మంచి చేసిన మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అవ్వ,తాతలు, రైతులు, బడుగుల, బలహీన వర్గాలు, మైనార్టీలు అందరి ప్రయోజనాలను రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. ధర్మాన్ని గెలిపించేందుకు.. విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా అన్నారు.
మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా పోరాడాలి. ఈ యుద్దంలో నేను ఎప్పుడూ పేదల పక్షమే ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబుకి మధ్య జరుగుతున్న ఎన్నికలు కాదు.. చంద్రబాబుకి, పేద ప్రజలకు జరుగుతున్న యుద్ధం అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే.. ఒక్కటి ఏదైనా మంచి చేసింది ఉందా..? అని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఎన్నికల ముందు మేనిఫెస్టో అమలు చేశారా..? అని ప్రశ్నించారు.