కాకినాడ జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. తుని నియోజకవర్గ నేత యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడన్న విషయం తెలిసిందే. యనమల కృష్ణుడు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. యనమల సోదరుల మధ్య విభేదాల కారణంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ యనమల కృష్ణుడు తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది.
ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మంత్రి దాడిశెట్టి రాజాపై తుని నుంచి కృష్ణుడు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి తుని టికెట్‌ను యనమల రామకృష్ణుడు కూతురికి టీడీపీ ఇచ్చింది. అప్పటినుంచి యనమల కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీలోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.