ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం మరోసారి సక్సస్ అయ్యింది. మరో కాంట్రాక్టు లో కూడా రివర్స్ టెండర్ విధానం సత్పలితాన్ని ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వెలిగొండ టన్నెల్ కాంట్రాక్ట్ లో 62కోట్ల రూపాయల మేర ఆదా అయిందని ప్రభుత్వం తెలిపింది.
గతంలో నాలుగు శాతం ఎక్సెస్ కు ఇవ్వగా,ఇప్పుడు ఏడు శాతం తక్కువకు మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఎల్ ఒన్ గా నిలిచి ప్రాజెక్టు పనులను దక్కించుకుంది. గతంలో 533 కోట్ల కాంట్రాక్టు ఇప్పుడు 491 కోట్లకే చేపట్టనున్నారు. కొద్ది రోజుల క్రితం రివర్స్ విధానంలో టెండర్లను పిలిచారు. దీంతో జగన్ ఐడియా.. మళ్లీ సూపర్ హిట్ అయ్యినట్టైంది.
కేంద్రం, విపక్షాలు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే జగన్ పోలవరం టెండర్లలోభారీగా ప్రజాధనం ఆదా చేశారు. తాజాగా వెలిగొండ విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు 7 శాతం తక్కువకు కోట్ చేయడం ద్వారా మేఘా కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకుంది.
ప్రభుత్వం బిడ్డింగ్ ధర కంటే 3 శాతం తక్కువకు ధరను నిర్ణయించింది. అయితే మేఘా కంపెనీ దానికంటే మరో 4 శాతం తక్కుపకు టెండర్ వేయడం ద్వారా మొత్తానికి అనుకున్నదాని కంటే 7 శాతం సొమ్ము ఆదా అయ్యింది. జగన్ చేపట్టిన ఇలాంటి రివర్స్ టెండర్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. మొత్తానికి పెద్ద ఎత్తున ప్రజాధనం మిగలడం మాత్రం మెచ్చుకోవాల్సిన అంశం.