Andhra Pradesh:అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లును రద్దు చేయడానికి ప్రభుత్వం సన్నాహలు

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.సమావేశాలకు అన్ని పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇక సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే అసెంబ్లీలో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించనున్నారు.5 రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. మరో మూడు నెలలకు సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుత సమావేశాల్లో గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ బిల్లును రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 23న ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.ఈ బిల్లు రద్దుకు మెజార్టీ ఎమ్మల్యేలు మద్దతు తెలిపే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news