అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పేర్ని నాని కుటుంబం !

-

The Perni Nani Family Went Underground: అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది పేర్ని నాని కుటుంబం. కృష్ణా జిల్లా వైసీపీ పార్టీకి ఊహించిన షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు..అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట.

The Perni Nani Family Went Underground

మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుధ. సివిల్ సప్లై గూడెం లో బియ్యం అవక తవకలు జరగడంతో పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్ని నాని సతీమణి జయసుధ, ఆయన పిఏ ల పై కేసు నమోదు చేశారు. ఈ తరుణంలోనే.. మూడు రోజుల నుంచి అందుబాటులో లేదట పేర్ని కుటుంబం. గత మూడు రోజుల నుంచి ఫోన్ స్విచాఫ్ పెట్టుకుందట పేర్ని నాని కుటుంబం. కేసు నమోదు నేపథ్యంలో పేర్ని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news