చంద్రబాబు కోసం కాన్వాయ్‌ రెడీ.. మొత్తం 11 వాహనాలు

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆయన కోసం నూతన కాన్వాయ్‌ రెడీ అయింది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారు. వీటిని చంద్రబాబు కాన్వాయ్‌ కోసం తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. విమానాశ్రయానికి అభిముఖంగానే సభా వేదిక ఉండటంతో హెలీప్యాడ్‌ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. విమానాశ్రయం ప్రధాన గేట్‌ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్రమోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహరీని ఆనుకొని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version