టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు బాలయ్య సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో మేకర్స్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ – బాబి కాంబోలో తెరకెక్కుతున్న ‘NBK109’ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా బాలయ్య ఈ సినిమాలో కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. సినిమా టైటిల్, రిలీజ్ డేట్ కూడా రివీల్ చేస్తారని ఫ్యాన్స్ భావించినా మేకర్స్ వీటిపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేవోల్, ఊర్వశీ రౌతెలా, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.