4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఏపీలో ఏం జరుగుతోంది?

-

ఇప్పటికే అధికార పార్టీ, కూటమి ప్రచారంతో హోరెత్తుతున్న ఏపీ ఎన్నికల్లో తాజాగా మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీ షాక్ తగిలింది. అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న భారీ నగదు పట్టుబడింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌ వెళ్తోన్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు.

ఒక్కో కంటైనర్‌లో రూ.500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. నాలుగు కంటైనర్లలో కలిపి మొత్తం రూ.2వేల కోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్‌బీఐ నుంచి హైదరాబాద్‌ ఆర్‌బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని వెల్లడించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం.. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, జిల్లా కలెక్టర్‌, ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారమం అందించారు. వారి సమక్షంలో కంటైనర్లు తనిఖీ చేసి.. నిబంధనల ప్రకారమే నగదు తరలిస్తున్నారా? లేదా? అనేది నిర్ధరించుకున్నారు. ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత కంటైనర్లను హైదరాబాద్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version