వివాదంలో చింతమనేని ప్రభాకర్ చిక్కుకున్నారు. చింతమనేని ప్రభాకర్ అతని అనుచరులపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. కష్టడిలో ఉన్న ముద్దాయిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని, అతను అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీంతో చింతమనేని, అతని అనుచరులపై Cr. No. 189/2024 u/s 224, 225, 353, 143 r/w 149 IPC కేసులు నమోదయ్యాయి.
పెదవేగి పోలీస్ స్టేషన్లో నిన్న పోలిసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు చింతమనేని. కొప్పులవారిగూడెం లో ఎలక్షన్ రోజున బూత్ లో కత్తెరతో దాడి చేసిన రాజశేఖర్ అనే టిడిపి కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త రవి పోలీసులకు ఫిర్యాదు మేరకు అతన్ని స్టేషన్లో ఉంచారు సీఐ.
ఈ విషయం తెలుసుకుని పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఉన్న టిడిపి కార్యకర్తను బయటకు తీసుకొచ్చి తనకారులో తీసుకెళ్లారు చింతమనేని ప్రభాకర్. పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని తన అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారు అంటూ చింతమనేనితో వాగ్దానికి దిగారు సీఐ కొండవీటి శ్రీనివాస్. వీడియో సాక్షాలు ఆధారంగా త్వరలో వారిని కూడా ఆరెస్ట్ చేస్తామని డి.ఎస్.పి లక్ష్మయ్య హెచ్చరించారు.