భారత దేశ వ్యాప్తంగా మళ్లీ 32 విమానాశ్రయాలు తెరుచుకున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర, పశ్చిమ భారత్లో పౌర విమాన సర్వీసులను నిలిపి వేశారు. పౌరవిమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని తెలిపింది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

ఇక అటు భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నాం అంటూ కీలక ప్రకటన చేశారు పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి. తాజాగా పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడారు. భారత్ జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని పాక్ ISPR DG అహ్మద్ షరీఫ్ చౌదరి అన్నారు. ‘మన దేశం, పౌరులపై భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చామన్నారు.