వీర జవాన్ మురళి నాయక్ తల్లికి అన్నం తినిపించిన మంత్రి సవిత

-

వీర జవాన్ మురళి నాయక్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత గొప్ప మనసు చాటుకున్నారు. కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీర జవాన్ మురళి నాయక్ తల్లికి అన్నం తినిపించారు మంత్రి సవిత. వీర జవాన్ మురళి నాయక్‌ను కోల్పోవడంతో ఆయన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

SAVITHA
Minister Savita fed rice to the mother of brave soldier Murali Naik

గత మూడు రోజులుగా వాళ్లు తిండితిప్పలు మానేసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత.. వీర జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులున్న ఇంటి వెళ్లి.. ఆమె స్వయంగా అన్నం తినిపించారు.

అటు మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. రేపు సత్యసాయి జిల్లా కల్లి తండాకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కానున్నారు. ఇటీవల పాకిస్తాన్ దాడుల్లో వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు ఐంది.

Read more RELATED
Recommended to you

Latest news