BREAKING : చంద్రబాబు అరెస్టుతో గుండెపోటుతో 6 మంది మృతి

-

నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే… చంద్రబాబు అరెస్ట్‌ కారణంగా గుండెపోటుతో ఏకంగా 6 మంది మృతి చెందారు. అనంతపురం జిల్లాకు చెందిన వడ్డే ఆంజనేయులు (65) చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని టీవీలో చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. కోనసీమ జిల్లాకు చెందిన కాకర సుగుణమ్మ (65) చంద్రబాబు అరెస్టును తన మనవడు సెల్ ఫోన్లో చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు.

6 people died due to heart attack due to arrest of Chandrababu

కోనసీమ జిల్లాకు చెందిన చెల్లుబోయిన నరసింహ రావు (62) చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ ఒత్తిడికి లోనై గుండెపోటుతో మృతి చెందారు. విజయనగరం జిల్లాకు చెందిన రైతు పైడితల్లి (67) చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనకు బయలుదేరి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి సుధాకర్ రావు (60) టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతి జిల్లాకు చెందిన వెంకటరమణ (46) సైతం టీవీలో చంద్రబాబు అరెస్ట్ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version