యూరప్ పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. తన కుటుంబంతో కలిసి ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు. రేపు ఢిల్లీ నుంచి యూరప్ కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఈ నెల 20వ తేదీన చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోనున్నారు. ఇక ఈ నెల 22వ తేదీన తిరిగి ఢిల్లీకి రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నెల 23న పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది.