టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య కీలక పదవీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా వర్ల రామయ్యను నియామకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, ఎస్ సవితమ్మ, దగ్గుమళ్ల ప్రసాదరావు ఉన్నారు.

కాగా ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్. 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం.. అభర్తుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. టీడీపీ 25, జనసేనకు 4, బీజేపీకి ఒక పోస్టు కేటాయింపు లు చేసింది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకూ చైర్మన్ల ఎంపిక చేయనుంది.