ఏపీలో కానిస్టేబుల్ పరీక్షకు 90 శాతం హాజరు – పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్‌

-

ఏపీలో కానిస్టేబుల్ పరీక్షకు 90 శాతం హాజరు అయినట్లు ప్రకటించారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్‌ మనీష్ కుమార్ సిన్హా. ఈ రోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు రిటన్ టెస్ట్ నిర్వహిస్తున్నాము, తరువాత ఫిజికల్ టెస్ట్ ఉంటుందన్నారు. ఐదు లక్షలు మూడు వేల మంది అబ్యర్థులు దరఖాస్తు చేసుకోవటం జరిగిందని..ఏపీ వ్యాప్తంగా పరీక్షకు 85 నుంచి 90 శాతం వరకు అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు.

997 సెంటర్స్ లో జరుగుతుంది…రాష్ట్ర వ్యాప్తంగా 40 పట్టణాలలో సెంటర్స్ ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం 5గంటలకి కీ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాము…ఎవరికైనా పొరపాట్లు జరిగి ఉంటే నిర్ణీత సమయంలో మా దృష్టికి తీసుకోవచ్చని వెల్లడించారు. కానిస్టేబుల్ , సబ్ ఇన్స్పెక్టర్ టెస్ట్ తరువాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది…కానిస్టేబుల్ కు అప్లై చేసిన వారు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉన్నారని తెలిపారు. ఎస్ఐ ప్రీమిలినరీ పరీక్షల తరువాతే కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version