మేడారం జాతరకు జాతీయ హోదాపై కేంద్రం స్పందించట్లేదని ఆగ్రహించారు MLC కవిత. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్.జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్.
ములుగు జిల్లా రామప్పకు యునెస్కో గుర్తింపు పొందిన మొదటిసారి రామప్పని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత…అనంతరం మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లా ఏర్పడినప్పటి తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి… గిరిజన యూనివర్సిటీ కోసం తల సేకరణ చేపట్టినప్పటికీకేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని వెల్లడించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించాలని తెలిపారు. ములుగు జిల్లా 50 ఎకరాల్లో కలెక్టరేట్ కార్యాలయం నిర్వహించడం జరిగిందన్నారు కవిత.