మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఛీటింగ్ కేసు నమోదు..!

-

మాజీ మంత్రి ఆళ్ల నానిపై ఛీటింగ్ కేసు నమోదు నమోదు అయింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మరికొందరిపై త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల సార్వత్రిక ఎన్ని కల సమయంలో శాంతినగర్ లక్ష్మీకృష్ణ రెసిడెన్సీ అపార్టుమెంట్లో వైకాపా నాయ కుడు దిరిశాల వరప్రసాద్ తదితరులతో కలిసి శాంతినగర్కు చెందిన అవుటు పల్లి నాగమణి ప్రచారంలో పాల్గొన్నారు.

A case of cheating has been registered against former minister Alla Nani

4వ అంతస్తులో ప్రచారం ముగించు కొని కిందకు దిగేందుకు అందరూ లిఫ్ట్ ఎక్కారు. అది ఫెయిలై కిందకు పడి పోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో నాగమణికి గాయాలు కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సచివాలయ వాలంటీర్లు కూడా ఉన్నందున ఎన్నికల సంఘంతో ఇబ్బందులు వస్తాయని విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. బాధితురాలు నాగమణికి వైద్య ఖర్చులు పెట్టు కుంటామని, ప్రమాద బీమా వచ్చేలా చేస్తామని, ఆర్థికంగా కుటుంబాన్ని ఆదు కుంటామని అప్పట్లో ఆళ్ల నాని హామీ ఇచ్చారు. తరువాత ఆ వాలంటీర్ న్ని పట్టించుకోలేదు.నష్టపరిహారం కూడా రాలేదు.

బాధితురాలు గట్టిగా అడగగా నాయకులు బెదిరించారు. తరువాత నష్టపరిహారం ఇవ్వకపోగా.. పట్టించుకోక పోవడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు శనివారం రాత్రి ఆళ్ల నాని, దిరిశాల వరప్రసాద్, సుధీరా బాబు, జీలూ ఖాన్, కురెళ్ల రాంప్రసాద్, ప్రైవేటు వైద్యులు సునీల్ సందీప్, లక్ష్మీకృష్ణ రెసి డెన్సీ ప్రెసిడెంట్, సెక్రటరీలపై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version