హెజ్బుల్లా అధినేత నస్రల్లా హత్య సరైనదే : బైడెన్

-

ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బుల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా హతమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు.నస్రల్లా హత్య సరైనదే అని ఇజ్రాయెల్‌‌కు మద్దతు పలికారు.గతేడాది యుద్ధం ప్రారంభం నాటి నుంచే నస్రల్లా హత్యకు ఆపరేషన్ మొదలైందని బైడెన్ ప్రకటించారు.హెజ్బుల్లా,హమాస్‌ వంటి ఇరానియన్‌ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోందన్నారు. ఈ పోరాటంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని స్పష్టంచేశారు.

దీనికితోడు మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధం తగ్గుముఖం పట్టేలా యూఎస్ సైనిక దళాల రక్షణను మరింతగా పెంచాలని రక్షణ కార్యదర్శిని ఆదేశించినట్లు బైడెన్ పేర్కొన్నారు. మరోవైపు బీరుట్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల ఫ్యామిలీస్, అమెరికన్‌ పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది.బీరుట్‌లోని హెజ్బుల్లా ప్రధాన ఆఫీసులపై ఇజ్రాయెల్ పాల్పడిన వైమానిక దాడుల్లో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్ కూడా మరణించినట్లు ఐడీఎఫ్ ధృవీకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version