మూసీ పరివాహక ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, సబిత నేతృత్వంలోని బీఆర్ఎస్ శ్రేణులు బయలు దేరుతుండగా..వారికి పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా ద్వారా కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. వారిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆదివారం పిలుపునిచ్చింది.
ఇప్పటికే హైదర్ కోట వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం చేరుకోగా తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.దీంతో మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకోగా..బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మూసీ బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆందోళనకు దిగారు. అయితే, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.బీఆర్ఎస్ నేతల పరామర్శ కార్యక్రమం కారణంగా నగరంలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.