ఆంధ్రప్రదేశ్ లో వరదలు మిగిల్చిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరదలు తీవ్ర స్థాయిలో నష్టం మిగల్చడంతో ఏపీ తీవ్ర స్థాయిలో నష్టపోతుంది. ఉభయగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. చాలా మంది రైతులు అయితే అప్పుల పాలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపధ్యంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వ బృందం రానుంది.
నవంబర్ రెండో వారంలో రానుంది. 9, 10 తేదీల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పర్యటించి వరద నష్టం అంచనా వేయనుంది. దాదాపుగా 15 వేల కోట్ల వరద నష్టం వచ్చిన సంగతి తెలిసిందే. అంచనా వేసిన తర్వాత కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.