ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన కూడా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి..అయితే దాంతో తల్లి దండ్రులు కూడా పిల్లలను అక్కడే జాయిన్ చేయాలనీ భావిస్తున్నారు..అతి తక్కువ మంది మాత్రమే జర్నలిజం వంటి కోర్సులు ఎంచుకుంటారు. ఐతే జర్నలిజం చదవాలనుకున్న వాళ్లకు ఏ కాలేజ్ ఉంది. అసలు వాళ్లకు ఏమైనా కోర్సులు ఉన్నాయా..? ఇలాంటి మీ సందేహాలకు సమాధానమే విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీకి వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిలో ఎన్నో కోర్సులు ఉన్నాయి. వాటిలో ఒకటి జర్నలిజం.
ఈ జర్నలిజం కోర్స్ జాయిన్ అవ్వడానికి డిగ్రీ ఉత్తిర్ణులైన విద్యార్థులు ఈ కింద పద్ధతులు ద్వారా అడ్మిషన్ పొందొచ్చు.ఎప్పటిలాగే ప్రతి ఏడాది యూనివర్సిటీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తుంది.www.audoa.in వెబ్ సైట్ ద్వారా యూనివర్సిటీలో అన్ని పీజీ కోర్స్ లకు నోటిఫికేషన్ ఇస్తుంది. అలాగే ఈ ఏడాది కూడా AUCET 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 22 నుంచి ప్రారంభం కాగా.. జూన్ 22 చివరితేది. అయితే రూ.750/- లేట్ ఫీతో కలిపి 26-06-22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అని వివరాలను నోటిఫికేషన్ లో వివరించారు. బాగా చదివి అప్లై చేసుకోవాలి.
అఫిషియల్ వెబ్‌సైట్ నుంచే అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వార్డ్ తో లాగిన్ అయితే మీ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.దరఖాస్తు చేసుకున్నా మీకు ఎలాంటి అడ్మిట్ కార్డు రాలేదు అంటే వెంటనే విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీని సంప్రదించండి లేదా అక్కడి అధికారులను ఈ కింద ఇచ్చిన ఈ మెయిల్ ద్వారా సంప్రదించండి. vicechancellor@andhrauniversity.info, registrar@andhrauniversity.info
ఈ ఎగ్జామ్స్ ను రాష్ట్రంలోని 8 సిటీలోని ప్రముఖ కాలెజీల లో నిర్వహిస్తారు.ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా www.audoa.in ఈ వెబ్‌సైట్‌లో పెడతారు. పరీక్షలో ర్యాంకింగ్ ఆధారంగా యూనివ్సిటీలోని 10 కోర్సుల వరకు మీకు నచ్చినవి ప్రాధాన్యత ఆధారంగా ఆప్సన్ ఇచ్చుకోవొచ్చు. జర్నలిజం కావాలనుకునే వారు వెబ్ ఆప్షన్ లో MJMC ఆప్షన్ పెట్టాలి. వెబ్ ఆప్షన్ పెట్టిన వారం రోజుల తర్వాత కౌన్సిలింగ్ కి వెళ్ళవలసి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఆఫీస్ లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. సెలక్ట్ అయిన విద్యార్థులకి అడ్మిషన్ కార్డ్ ఇచ్చి సంభందిత డిపార్ట్మెంట్ల కు రెఫర్ చేస్తారు..జర్నలిజం పై ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోండి.