జాతీయ ఎస్సీ కమిషన్ కు చంద్రబాబు సర్కార్‌ పై ఫిర్యాదు !

-

జాతీయ ఎస్సీ కమిషన్ కు చంద్రబాబు సర్కార్‌ పై ఫిర్యాదు అందింది. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ను కలిసింది వైఎస్ఆర్సిపి ప్రతినిధుల బృందం. విజయవాడలో అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం పై టిడిపి శ్రేణుల దాడి పై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సిపి ప్రతినిధులు. ఈ అంశంలో జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకొని దర్యాప్తు చేయాలని వినతి అందించారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే లైట్లు ఆపివేసి, సీసీ కెమెరాలు ఆపేసి దాడికి దిగారని ఎస్సీ కమిషన్ చైర్మన్ కు వివరించారు నేతలు ఈ ఘటనపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని , ఎస్సీ లపై జరుగుతున్న దాడులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వినతి అందించారు. వైయస్ఆర్సీపి ప్రతినిధుల బృందంలో ఎంపీ గురుమూర్తి , మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎంఎల్ సి అరుణ్ కుమార్, కైలే అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version