వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. వైసీపీ పార్టీలోకి ఓ సీనియర్ లీడర్ కుమారుడిదే ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర అని సీఐడీ దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/chandrababu-2.jpg)
మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు, ముడుపుల చెల్లింపులకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం వంటి ప్రధాన ఆరోపణలు వస్తున్నట్లు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ హయాంలో చోటుచేసుకున్న మద్యం దోపిడీ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియామకం చేసింది చంద్రబాబు సర్కార్.
ఈ బృందానికి విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు (ఐజీ ర్యాంకు) నేతృత్వం వహించనుంది. అయితే… వైసీపీ పార్టీలోకి ఓ సీనియర్ లీడర్ కుమారుడిని ఇరికించేందుకు ఈ కేసును చంద్రబాబు తెరపైకి తెచ్చినట్లు వైసీపీ నేతలు ఆగ్రహిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణం..!
పెద్దిరెడ్డి కుమారుడిదే ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర అని సీఐడీ దర్యాప్తు
మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు, ముడుపుల చెల్లింపులకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం వంటి ప్రధాన ఆరోపణలు
జగన్ హయాంలో చోటుచేసుకున్న మద్యం… pic.twitter.com/cQ7RyWDkfE
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025