చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాముకాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తుందా లేదంటే ప్రమాదవశాత్తు పాముకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు.
ఇలా వింత సమస్యతో సతమతం అవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా.. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. అవును అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిరుపేద కూలీ సుబ్రహ్మణ్యం కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. అయితే.. ఆయన్ను వదలకుండా పాములు వెంటాడుతూ కాటేస్తూ ఉండటం సంచలనంగా మారింది. 18 ఏళ్ల వయసులో తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. అయితే.. ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.