పట్టింపు లేని నీ విధానం.. పట్టుదలతో పని చేయడం మా విధానం.. కేసీఆర్ చేసిన అప్పులు.. చేసిన తప్పులకు లక్ష 53 వేల కోట్లు కట్టిన అని సీఎం రేవంత్ తెలిపారు. లక్ష 53 వేల కోట్లు నా దగ్గర ఉంటే క్షణం లో 2 లక్షల రుణాలు మాఫీ చేసే వాణ్ణి.. ఓ వ్యక్తి చేసిన అప్పులకు మనం తిప్పలు పడుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ లు 8000 కోట్లు పెండింగ్ పెట్టారు. 11 శాతం ఇంట్రెస్ట్ తో అప్పులు తెచ్చిండు కేసీఆర్. 4 శాతం ఇంట్రెస్ట్ కి అప్పు ఇవ్వడానికి చాలా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి.
దొంగ పనులు చేసే వాడే ఎక్కువ వడ్డీ కి అప్పులు చేస్తారు. కేంద్ర అధికారుల కాళ్ళా వెళ్లా పది..5 శాతం కి తగ్గించండి అని తిరుగుతున్న. ఇసుకలో పదేళ్ల లో 7 వేల కోట్లు దోచుకున్నారు. కేసీఆర్ మందు డోర్ డెలివరీ విధానం తెచ్చారు . నేను ఇసుక డోర్ డెలివరి చేస్తున్నా అని రేవంత్ పేర్కొన్నారు.