షర్మిల ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరిగిందని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో షర్మిల టీమ్ అరాచకాలు పెరిగిపోయాయి, వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారు.. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా ఎన్నికల్లో షర్మిల టీమ్ ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ వోట్ శాతం తగ్గింది అంటూ సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను స్క్రాప్ కింద జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. కార్యకర్తలకు కనీసం అండగా నిలబడలేదు. కనీసం ఏ ఒక్క సీనియర్ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు ఇంచార్జ్ మనిక్కం టాగోర్ కూడా అంతేగా ఉన్నారన్నారు. ఎన్నికలకు రాష్ట్ర పర్యటన కూడా చేయలేదు, రాహుల్ గాంధీ వచ్చిన రోజు మినహా ఏ రోజు రాష్ట్రానికి రాలేదు. షర్మిల వ్యవహారంపై ఢిల్లీలో తేల్చుకుంటామని హెచ్చరించారు.