ఏసీలో కుప్పలు కుప్పలుగా పాములు ప్రత్యక్షం అయ్యాయి. చాలా రోజుల తర్వాత ఏసీ వేస్తున్నారా.. అయితే మీ ఏసీలో కూడా ఇలానే పాములు ఉండొచ్చు. తాజాగా జరిగిన సంఘటన చూస్తే… మనకు ఇదే అర్థం అవుతుంది. విశాఖ జిల్లా పెందుర్తిలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లోని ఏసీలో పిల్లలు పెట్టింది ఓ పాము.
ఇక ఈ సమాచారం అందుకొని ఏసీలో ఉన్న పాము, పిల్లలను బయటికి తీశాడు స్నేక్ క్యాచర్. దీంతో అన్ని పాము పిల్లలను చూసి భయందోళనకు గురయ్యారు స్థానికులు. దీంతో ఏసీలో కుప్పలు కుప్పలుగా పాములు ప్రత్యక్షం అయిన వీడియో వైరల్ గా మారింది. కాబట్టి ఈ ఎండాకలం ఏసీలు ఓన్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందే.
https://twitter.com/TeluguScribe/status/1899676891860083042