తెలంగాణ భవన్ వద్ద ఓ బాలుడు హల్చడ్ చేశాడు. భవన్‌కు కేసీఆర్ వస్తున్నారని తెలిసి ఆయన్ను కలిసేందుకు బాలుడు వచ్చినట్లు తెలిసింది. తాను ఉదయం వస్తే కేసీఆర్‌ను కలువకుండా గేట్ వద్దే ఆపారని, తనను లోనికి వెళ్లనివ్వడం లేదని ఆ బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
చివరకు భవన్ లోపలి నుంచి పిలుపురావడంతో సదరు బాలుడిని అధికారులు లోనికి తీసుకెళ్లారు. మరి ఆ బాలుడు మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల కారణంగా నిన్న భవన్‌లో కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.