AP Crime: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దారుణ హత్య..

-

ప్రకాశం వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధ దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది రాధ. తిరునాళ్ళ కోసం రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చింది రాధ. అయితే.. నిన్న సాయంత్రం నుండి కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు.

సెల్ ఫోన్‌ లొకేషన్ ద్వారా జిల్లెళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద రక్తపు గాయాలతో మృతదేహం గుర్తించారు పోలీసులు. స్నేహితుడు ఫోన్ చేయటంతో బయటకు వచ్చిన రాధ బయటకు వచ్చిందంటున్నారు కుటుంబ సభ్యులు. నగదు వ్యవహారంలో గత కొద్దికాలంగా స్నేహితునితో రాధకు విభేదాలు ఉన్నాయని టాక్‌. రాధ స్నేహితుడు, మరికొందరితో కలసి హత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు. హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..క్లూస్ టీం తో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు..రాధ మృతదేహానికి పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version