హైదరాబాద్‌లో పవన్‌ ఓజీ షూటింగ్‌

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్ర “ఓజీ”(OG). సాహూ ఫేమ్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తమిళ స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.

ఈ రెండు షేడెల్స్ లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను, ఒక సాంగ్ ను తెరకెక్కించాడు సుజీత్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్ లో పవన్, ప్రియాంకలపై కీలక సీన్స్ చిత్రీకరించనున్నారు. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి బీజీఎమ్ కింగ్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్ అండ్ అనౌన్స్మెంట్ వీడియోకు ఆడియన్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

ఈ ఒక్క వీడియోతో సినిమా ఎలా ఉండబోతోంది హిట్ ఇచ్చి అంచనాలు భారీగా పెంచేసాడు సుజీత్. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ గ్యాంగ్ స్టర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version