ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు

-

తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమాయకపు అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో  రెండు రోజుల కిందట ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలిక పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజాగా విద్యాబుద్దులు చెప్పే ఉపాధ్యాయుడే దుర్బుద్దికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెల్లితే.. విజయనగరం జిల్లా నెల్లిమర మండలంలో ఆరో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఉపాధ్యాయుడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు కీచక ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి వికృత చేష్టలను తల్లి దండ్రులకు చెప్పింది బాలిక. పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version