ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ వేరుశెనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండు సంవత్సరాలు ఉన్న పాప మరణించింది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన నల్ల చెరువులో హనుమంతు అనే వ్యక్తికి చెందిన రెండేళ్ల కూతురు నయన శ్రీ ఆడుకుంటూ వేరుశెనగ విత్తనాన్ని నోట్లో పెట్టుకుంది.
అయితే ఆ వేరుశెనగ విత్తనం గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక… విలవిలలాడింది. వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక అప్పటికే ఆ చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కూతురిని మిగతా జీవిగా చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.