ఏపీ మంత్రి ఆదుకోవాలని వేడుకుంటున్న కువైట్ నుంచి మహిళ

-

అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ కువైట్‌ లో చిక్కుకుంది. అయితే… గల్ఫ్ లో చిక్కుకున్న మహిళ తనను రక్షించాలంటూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కోరారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లెకు చెందిన తిరుపతి కవిత అనే మహిళ… బతుకు దెరువు కోసం కువైట్ కి వెళ్లింది.

A woman from Kuwait is pleading with AP Minister Mandipalli Ramprasad Reddy for help

కువైట్ లో ఏజెంట్లు మోసం చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి విన్నవించుకుంది మహిళ. ఇక దీనిపై వెంటనే స్పందించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కవిత ను కువైట్ నుండి ఇండియాకు రప్పించేందుకు సంబంధిత అధికారులకు లెటర్ రాశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version