డేటింగ్ పేరుతో యువతిని మోసం చేసి విదేశాలకు పారిపోయిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటానని, విదేశాలకు వెళ్ళాక యువతిని బ్లాక్ చేసాడు వేలూరి శశాంక్. హైదరాబాద్–అమీర్‌పేట్ కు చెందిన యువతిని బెంగుళూరులోని కామన్ ఫ్రెండ్స్ మీటింగులో కలిసి, తొలిచూపులోనే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, యువతిని శారీరికంగా లోబరుచుకున్నాడు వేలూరి శశాంక్.

మాస్టర్స్ కోసం యూకే వెళ్లి తిరిగి వచ్చాక పెళ్లి చేసుకొని తనని కూడా విదేశాలకు తీసుకెళ్తానని యువతిని నమ్మించింది శశాంక్.విదేశాలకు వెళ్ళాక యువతిని అన్ని సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ చేయడంతో, యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. ఆ యువతి ఫిర్యాదు మేరకు శశాంక్ పట్ల లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. యూకే నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నాడని సమాచారం అందుకొని, ఎయిర్‌పోర్టులో శశాంక్‌ను అరెస్టు చేశారు పోలీసులు.