వైఎస్ జగన్ ను కలిసేందుకు యువకుడి సాహసం చేసాడు. బారికేడ్లను దూకి జగన్ వైపుకు వెళ్లేందుకు అభిమాని ప్రయత్నం చేసాడు. ఈ తరుణంలోనే యువకుడిని పట్టుకుని లాగిపడేసిన పోలీసులు.. అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు సాహసం యువకుడి వీడియో వైరల్ గా మారింది.

ఇక అటు వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ జగన్. ఇవాళ కల్లితండాకు వెళ్లిన మాజీ సీఎం వైఎస్ జగన్… ఆపరేషన్ సిందూర్ లో భాగంగా అమరుడైన జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక ఈ సందర్బంగా వైఎస్ జగన్ గారిని చూడగానే ఆలింగనం చేసుకున్నారు వీర జవాన్ మురళి నాయక్ తండ్రి. అనంతరం జగన్ మాట్లాడారు.
ఈ సందర్బంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. దేశం కోసం మురళీ నాయక్ ప్రాణాలర్పించారు.. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. మురళి కుటుంబానికి వైసీపీ పార్టీ నుంచి 25 లక్షలు సహాయం ఇస్తామని ప్రకటించారు.