మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సిందూరం తుడిచిన ఉగ్రవాదుల నట్టింట్లోకి వెళ్లి చంపేశాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పంజాబ్ లోని అధంపూర్ ఎయిర్ బేస్ కు ప్రధాని మోడీ వెళ్లారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను కలిసారు మోడీ. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటింఛారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడారు.

న్యూక్లియర్ బాంబులతో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు ప్రధాని మోదీ. యుద్ధంలో పోరాడిన సైనికులైన మీ దర్శనం కోసమే వచ్చాను… మీ ధైర్య సాహసాలను చూస్తే గర్వంగా ఉందని తెలిపారు. పాక్ డ్రోన్లు మన గగనతలాన్ని దాటలేకపోయాయని సెటైర్లు పేల్చారు మోడీ.