BREAKING: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత..మళ్లీ పోస్టింగ్

-

BREAKING: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు భారీ ఊరట లభించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్‌ రెడ్డి.

AB Venkateswara Rao gets relief in High Court

ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మూడు వారాల క్రితం ABV సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version