చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఇలాగే చేస్తామని ఆదిమూలపు సురేష్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పర్యటన సందర్భంలో దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్.. క్షమాపణ చెప్పాలని శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. మేము దాడి చేయాలని ప్రమాణం చేయటానికి నేను సిద్ధమని సవాల్ చేశారు.
టీడీపీ నేతలు వస్తే కాణిపాకం ఆలయానికి వెళ్ళి ప్రమాణం చేద్దాం..నిరసన ప్రాంతానికి చేరుకున్న సమయంలో దళిత నేతలను వేలు చూపించి బెదిరించారన్నారు. అల్లరి మూకలను మా మీదకు ఉసిగొల్పారు..ఈ ప్రదేశంలో ఆపి రెచ్చగొట్టారని ఆగ్రహించారు ఆదిమూలపు సురేష్. కారంచేడు, చుండూరు లాంటి మరో మారణహోమం సృష్టించాలనుకున్నారు..దళితుల పట్ల చంద్రబాబులో మార్పు రాదని విమర్శలు చేశారు. ప్రీ ప్లాన్ స్క్రిప్ట్ ప్రకారమే అల్లరి మూకలను తీసుకువచ్చారు..రాళ్ళు, జెండాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారన్నారు. వైసీపీ కార్యకర్తలకు రక్త గాయాలయ్యాయని తెలిపారు ఆదిమూలపు సురేష్.