చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు అపార నష్టం తెస్తోంది..!

-

చంద్రబాబు ప్రభుత్వంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జాతీయ విద్యారంగంలో మేము ఎన్నో సంస్కరణలను తెచ్చాం. అవి అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. ఇది పేద విద్యార్థులకు అపార నష్టం తెస్తోంది అని తెలియజేసారు. గత ఐదేళ్లలో మేము విద్యారంగానికి రూ.73 వేల కోట్లు ఖర్చు పెట్టాం. నాడు-నేడు కింద వేలాది స్కూళ్లని బాగు చేశాం. జాతీయ విద్యావిధానంలో భాగంగా NEP 2020ని అమలు చేశాం.

అయితే ఇప్పుఫు చంద్రబాబు ప్రభుత్వం జాతీయ విద్యావిధానానికి అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలి. జగన్ తెచ్చిన పథకాలపై వ్యతిరేకంగా ముందుగా ఎల్లోమీడియాలో రాయిస్తారు. తర్వాత ఆ పథకాలన్ని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది . ఇలా ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తున్నారు. తల్లివందనం అమలు చేయకుండా మోసం చేశారు . దీనిపై ఎల్లోమీడియా ఎందుకు వార్తలు రాయటం లేదు..? జగన్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను కేంద్రమే మెచ్చుకుంది. ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయవద్దు అని ఆదిమూలపు సురేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version